Monday, March 23, 2026
HomeSports Newsకెప్టెన్‌గా దినేశ్‌ కార్తీక్‌

కెప్టెన్‌గా దినేశ్‌ కార్తీక్‌

Loading

ముంబై, మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్: హాంకాంగ్‌ సిక్సెస్‌ క్రికెట్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా దినేశ్‌ కార్తీక్‌ వ్యవహరిస్తాడు. నవంబర్‌ 7 నుంచి 9 వరకు ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది.

ఒక్కో టీమ్‌లో ఆరుగురు సభ్యులు ఉండి ఆరు ఓవర్ల చొప్పున సాగే ఈ ‘సిక్సెస్‌’ టోర్నీ 1992 నుంచి నిర్వహిస్తుండగా ప్రపంచ క్రికెట్‌లో దీనికి మంచి ప్రాచుర్యం లభించింది. 2005లో ఒకసారి టైటిల్‌ గెలిచిన భారత్‌ రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది. భారత మాజీ స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా ఈ టోరీ్నలో ఆడే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page