![]()
కొత్త రేషన్ కార్డులకు ‘మీ సేవ’ లో అప్లికేషన్లు..!
కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అధికారికంగా మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారుల నుంచి ఫిబ్రవరి నెలాఖరు లోగా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభయ హస్తం పేరుతో మొత్తం 5 గ్యారెంటీలకు దాదాపు కోటి పది లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అత్యధికంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం, ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారే ఉన్నారు.


