![]()
హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 12
కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఆయన మాట్లాడుతూ అభయహస్తంలోని 6 గ్యారంటీలలో భాగంగా అన్నీ అమలు చేస్తామని, తెల్ల రేషన్ కార్డులపై కేబినెట్లో చర్చించామని తెలిపారు.త్వరలోనే వాటిని జారీ చేస్తామని, పేదలను ఆడుకుంటామని అన్నారు. కులాల కోసం 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని,ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విశాలంగా రైతు బజార్లను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.అలాగే రైతు బంధు డబ్బుల జమపై కూడా చర్చించినట్టు తెలిపారు.ఇప్పటివరకు 84 శాతం మందికి రైతుబంధు సాయం అందినట్టు, రాబోయే రెండు రోజుల్లో సాయం 93 శాతానికి చేరుతుందని,అర్హులందరికీ సాయం అందిస్తామని, డబ్బుల జమపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.


