![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాస రావు గారి మరణంతో ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అయితే ఈ క్రమంలో బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కోట గారు పోయి గంటలు గడవకముందే.. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్‌తో మా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నానని పోస్ట్ పెట్టాడు బండ్ల. హీరో శ్రీకాంత్, అలీ, శివాజీ రాజా, ఉత్తేజ్‌తో దిగిన ఫొటోను షేర్ చేశాడు.
ఇక ఈ పోస్ట్‌తో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పెద్దాయన పోయింది ఉదయాన్నే.. మీరు సాయంత్రం మొదలెట్టేశారా.. కనీస గౌరవం లేదా అని తిట్టిపోస్తున్నారు. కనీసం పోస్ట్ పెట్టకుండా అయినా ఉండాల్సిందని సూచిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం వినోదం మూవీ సీక్వెల్ తీయాలని సూచిస్తున్నారు.


