Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemకోయ భాష అంతరించిపోకుండా ఆదివాసీ గిరిజనులు కాపాడుకోవాలి

కోయ భాష అంతరించిపోకుండా ఆదివాసీ గిరిజనులు కాపాడుకోవాలి

Loading

కోయ భాష అంతరించిపోకుండా ఆదివాసీ గిరిజనులు కాపాడుకోవాలి

  • ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్

భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో, జులై 21

ప్రపంచీకరణలో భాగంగా మొదలైన భాష సంస్కృతిక విధ్వంసం వలన ఆదివాసీలపై తీవ్ర ప్రభావం చూపి దినితో పలు భాషలు అంతరించిపోతున్నాయని వీటిలో కోయ భాష ఒకటని భాష అంతరించిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత ఆదివాసి గిరిజనులపై ఉందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. ఆదివారం నాడు ఐటీడీఏ ప్రాంగణంలోని ఆదివాసి గిరిజన భవనంలో నిర్వహించిన కోయ భాషా దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిపి లేని కోయ భాషకు వివిధ రాష్ట్రాల అధికార భాషలను కలిపి నిఘంటువు తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైందని, భాష అంటే కేవలం భావ ప్రకటన మాధ్యమే కాదని, కోయ భాష సంస్కృతి ఆత్మగౌరవ ప్రతిక, అంతరంగాన్ని ఆవిష్కరించే ఒక సాధనా అని, మనోభావాలు హక్కులు రక్షించే వారసత్వ సంపద అని, అది నిత్యం పారే జీవనది లాంటిదని ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు మరింత అపురూపమైనదని, దీనిని పదిలపరిచి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని ఆయన అన్నారు. లిపిలేని కోయ భాషను బతికించుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నదని, కోయ భాషను మాట్లాడే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా , ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలో కాగా మాండలికల్లో కొద్ది పాటి తేడా ఉంటుందని ఆయన అన్నారు. కోయలు మాట్లాడే భాషకు లిపి లేదని కోయ భాష అంతరించిపోతున్న భాషల్లో ఇది ఒకటని, అడవి ప్రాంతాల్లోని కోయ తెగలు ఇంకా కొంత అనాగరికత గానే ఉన్నారని, వీళ్లు కోయ బాషతో పాటు తెలుగు కూడా అనర్గళంగా మాట్లాడగలరని, తెలుగు, కన్నడం ,తమిళ భాషలు రాగానే పూర్తి సమయం ఎక్కువగా గడ్డి గుడిసెలలో నివాసాలు ఉంటారని ఆయన అన్నారు.

తెలుగు భాష మాట్లాడే వారి వలన కోయ భాష అలాగే సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని, అందుచేతనే ఐక్యరాజ్య సమితి సంస్థ యునేస్కో జూలై 21, 2014వ సంవత్సరాన్ని ఆదివాసి కోయ భాషా దినోత్సవం ప్రకటించిందని ఆయన అన్నారు. ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఆదివాసి భాషల పరిరక్షణకు మనమందరం కట్టుబడి కోయ భాషను రక్షించుకోవాలని, అందుకు మొదట తల్లిదండ్రులు పిల్లలతో కోయ భాష మాట్లాడటం, కుటుంబ సభ్యులందరూ పిల్లలతో కోయ భాష వారితో మాట్లాడాలని, మన భాష గొప్పదనం గురించి వారికి తెలియజేయాలని, అలాగే మన గురించి తల్లిదండ్రులు ఆదివాసి సమాజంలోని పెద్దలు విద్యావంతుల గొప్పతనం, ప్రాముఖ్యత, మంచితనం, దానగుణం క్రమశిక్షణ గురించి గొప్పగా చెప్పాలని అన్నారు.
త్వరలో అన్ని పాఠశాలల్లో కోయ భాషకు సంబంధించిన విద్యను బోధించేలా ప్రయత్నాలు ప్రారంభిస్తామని అన్నారు. అనంతరం కోయ కల్చర్ కి సంబంధించిన నాట్యాలను తిలకించారు. ఆదివాసి కోయ తెగ పెద్దలకు సత్కరించారు. అనంతరం ప్రాజెక్టు అధికారి గారికి కోయబాషా దినోత్సవం సందర్భంగా చిరు సత్కారం గావించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏసీఎంఓ రమణయ్య, తెల్లం జోగయ్య, కోడెం భూదేవి, సిహెచ్ శ్రీరామ్ మూర్తి, బాలరాజు, శ్రీనివాస్, ఆశ్రమ పాఠశాల నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page