![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 15
మండలంలోని కోయగూడెం గ్రామంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తండ్రి కోరం పుల్లయ్య దిశ దినకర్మలకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాషా బుధవారం హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వాసిరెడ్డి మురళి, భూక్య శ్రీనివాస్, గుగులోత్ రామ్ చందర్, రమేష్ చాంద్, మిరియాల రాము, తదితరులు పాల్గొన్నారు.


