![]()
ఖమ్మంలో న్యూ లక్కీ ట్రైడ్ ఫెయర్ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఖమ్మం, మన భద్రాద్రి న్యూస్ బ్యూరో
ఖమ్మం నగరం లోని బోనకల్ రోడ్డు, లక్ష్మీ గార్డెన్ పక్కన ఆదూరి గోపిరెడ్డి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన న్యూ లక్కీ ట్రైడ్ ఫెయర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైనట్టు మేనేజర్ సయ్యద్ రహమత్ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ 50 రోజులు ఉంటుందని అన్నారు. రోబోటిక్ జంతువుల బొమ్మలు, బర్డ్స్, పక్షులు, నెమలి, ఏనుగు వంటి వాటితో పాటు మరికొన్ని ప్రత్యేక ఆకర్షనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు . 80 అడుగుల జెయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, సూపర్ డ్రాగన్ ట్రైన్, డెవిల్ హౌస్ తో పాటు 100 అడుగుల టవర్, పిల్లల కోసం వాటర్ బోట్, హెయిర్ డాన్సర్, జంపింగ్, ఏరోప్లేన్, బేబీ కార్, స్కార్పియ కార్, రిమోట్ కార్ వంటివి 30 అంశాల ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీటితో పాటు రెడీమేడ్ గార్మెంట్, హైదరాబాద్ బ్యాంగిల్స్, ఫిరోజ్ బాద్ పింగాణి ఐటమ్స్, తిను బండారాలు, చాట్ బండార్, స్మోక్ బిస్కెట్ వంటివి కూడా ఏర్పాటు చేశారని, అలాగే 30 అడుగుల ఎత్తులో బర్డ్స్ అండ్ రోబోటిక్ సెట్టింగ్ అందంగా ఆకర్షణయంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.


