![]()
కొత్తగూడెం లీగల్, మన భద్రాద్రి న్యూస్
గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ( ఫుల్ అడిషనల్ చార్జ్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, స్పెషల్ జడ్జి ఫర్ ఎన్ డి పి ఎస్ ) ఇద్దరికి పన్నెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం కు చెందిన తాడి శివ శంకర్ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మల్కాన్ గిరి జిల్లా బాపనపల్లికి చెందిన ఆజగర్ ఖాన్ అలియాస్ సంతోష్ లు 2023 జూన్ 16న సిఆర్పిఎఫ్ క్యాంపు, కూనవరం రోడ్డు, భద్రాచలం నందు మారుతి ఎకో వ్యాన్లో 242 గంజాయి పొడి ప్యాకెట్లు, యూనికాన్ మోటార్ సైకిల్లో నాలుగు కిలోల గంజాయిని అక్రమ రవాణా చేయుచుండగా అప్పటి భద్రాచలం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీకాంత్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేయుచుండగా వేగంగా వచ్చుచున్న వీరి వాహనాలను ఆపి పరిశీలించగా పొడి గంజాయి ప్యాకెట్లు లభించాయి. మొత్తము తూకము 484 కేజీలు, వాటి విలువ రు. 96,80,000/- కలదుగా గుర్తించి సబ్ ఇన్స్పెక్టర్ పి శ్రీకాంత్ సమక్షంలో పంచనామా ద్వారా స్వాధీనం చేసుకొని భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


