![]()
గిరిజన విద్యార్థులకు చలి కోటు పంపిణీ
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్,
టేకులపల్లి మండలం, గంగారంలో ఉన్నటువంటి ఆశ్రమ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో శుక్రవారం నాడు విద్యార్థులకు ఐటీడీఏ, పరిధిలో చలి కోట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు పి నరసయ్య, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పెండేకండ్ల రామనాథం, బుగ్గ వెంకటేశ్వర్లు, వార్డెన్ దొడ్డ వెంకటేశ్వర్లు, ఇంగ్లీష్ బాలు, టి వెంకటేశ్వర్లు, సీతారామయ్య, బాలాజీ, బిచ్చ, స్వామి, హరిదాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.


