Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemగుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి

గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి

Loading

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 24

మండలంలోని ఎర్రాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న పొదెం వెంకటేశ్వర్లు(60) ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లేందుకు బయలుదేరుతుండగా గుండెపోటుతో బూడిదగడ్డలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. హుటాహుటిన ఆయనను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతి చెందిన ప్రధానోపాధ్యాయుడి స్వస్థలం మండలంలోని బోడు గ్రామం. మృతుడికి భార్య సుజాత, కుమార్తె శ్రావ్య ఉన్నారు. ఎంఈవో జగన్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు హరిలాల్, టీఎస్ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ల శ్రీనివాసరావు, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీఎం విజయనిర్మల, వెంకటేశ్వర్లు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page