Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemగుడుంబా పై ఉక్కు పాదం మోపిన కరకగూడెం ఎస్సై

గుడుంబా పై ఉక్కు పాదం మోపిన కరకగూడెం ఎస్సై

Loading

-గుడుంబా స్థావరాలపై దాడులు

-గుడుంబా అమ్మితే కఠిన చర్యలు తప్పవు

-ఎస్సై రాజేందర్ హెచ్చరిక

కరకగూడెం, మన భద్రాద్రి న్యూస్, మే 18

మండలంలో గుడుంబా స్థావరాలపై కరకగూడెం ఎస్ఐ రాజేందర్, తమ సిబ్బందితో శనివారం గుడుంబా తయారు చేసే స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. గుడుంబా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే కరకగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కలవల నాగారం అటవీ ప్రాంతంలో గుడుంబా తయారీ స్థావరాలపై ఎస్సై రాజేందర్ తమ సిబ్బందితో దాడి చేసి, బట్టీలు పెట్టి గుడుంబా తయారు చేస్తుండగా వాటిని పట్టుకొని తమ సిబ్బందితో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ మండలంలో ఎక్కడ గుడుంబా తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏజెన్సీ గ్రామాలలో అమాయక గిరిజనులు గుడుంబా వల్ల తమ జీవితాలను కోల్పోతున్నారని, దొంగ చాటుగా గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారంతో కలవలనాగారం అటవీ ప్రాంతంలో వెతకగా గుడుంబా తయారీ స్థావరాలను గుర్తించామని ఆయన తెలిపారు. గుడుంబా తయారీదారులు అక్కడి నుంచి పారిపోయారని, గుడుంబా తయారు చేసినా లేదా అమ్మినా వారిపై పీడి యాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు పంపియాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గ్రామాలలో యువకులు, మహిళలు గుడుంబా తయారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎవరు తయారుచేసినా తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page