![]()
భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో
2024 -25 విద్యా సంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో (జూనియర్ ఇంటర్) మిగిలిన సీట్ల భర్తీ కొరకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు మరియు ఇటీవలే పదవ తరగతి (2023- 24) విద్యా సంవత్సరం పూర్తి అయిన అభ్యర్థులు తప్పకుండా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల పదవ తేదీ ఉదయం 9 గంటలకు బాల, బాలికలు స్పాట్ కౌన్సిలింగ్ కు తెలంగాణ గిరిజన గురుకుల కళాశాల (బాలికలు) భద్రాచలం వద్ద స్పాట్ అడ్మిషన్ ప్రక్రియకు హాజరు కాగలరని ఆయన కోరుతూ, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాంతీయ సమన్వయ అధికారి, ఖమ్మం రీజియన్ తుమికి వెంకటేశ్వరరాజు కోరారు.


