Friday, March 27, 2026
HomeTelangana Newsగొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం

గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం

Loading

గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్, మన భద్రాద్రి,

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి పట్టించిన అధికారులు, కాంట్రాక్టర్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ డీజీ సీజీ ఆనంద్ పర్యవేక్షణలో కేసు విచారణ జరగనుంది. కాగా గొర్రెల స్కామ్‌ విషయంలో గచ్చిబౌలిలో నమోదైన కేసును పోలీస్ అధికారులు ఏసీబీకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి హైకోర్టును ఆశ్రయించారు. గొర్రెల స్కామ్‌పై నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ కేశవ సాయికి హైకోర్టులో ప్రతికూల తీర్పు వెలువడింది. కేసు విచారణ దశలో ఉండగా జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అంతే కాకుండా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కాగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ ఎత్తున స్కామ్ జరిగిందనే ఆరోపణలు కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page