Monday, March 23, 2026
HomeNational Newsగ్యాస్ సిలిండర్లపై భారీ ఊరట

గ్యాస్ సిలిండర్లపై భారీ ఊరట

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్పంగా లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్‌పై రూ. 33.50 పైసల రూపాయల మేర తగ్గింది. ఈ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. వాటి రేట్లను తగ్గించడం ఈ ఏడాదిలో ఇది ఆరోసారి. జనవరిలో రూ. 14.50 పైసలు, ఫిబ్రవరిలో ఏడు రూపాయలు, ఏప్రిల్ లో 41 రూపాయల మేర వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు తగ్గాయి.జూన్ 1వ తేదీన కూడా వీటి రేట్లు తగ్గాయి. ఒక్కో సిలిండర్ మీద 24 రూపాయల మేర తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పుడు ఒక్కో సిలిండర్ ధర రూ. 33.50 పైసల మేర తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది కాలంలో ఒక్కసారే ఈ సిలిండర్ల రేట్లు పెరిగాయి. మార్చి 1వ తేదీన ఆరు రూపాయల మేర పెంచాయి.

తాజా తగ్గింపుతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,665 రూపాయల నుంచి 1,631.50 పైసలకు తగ్గింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 1,616.50 నుంచి రూ.1,583కు తగ్గింది. కోల్‌కతలో రూ. 1,769 నుంచి 1,735.50 పైసల మేర తగ్గింది. చెన్నైలో నిన్నటివరకు రూ. 1,822.50 పైసలు ఉన్న కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర.. ప్రస్తుతం రూ. 1,790 పైసలు పలుకుతోంది.గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర రూ.855. 50 పైసలు. ఈ ఏడాది ఏప్రిల్ లో వీటి రేట్లను భారీగా పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఒక్కో సిలిండర్ మీద 50 రూపాయలు పెరిగింది. ఉజ్వల పథకం కింద నిరుపేద కుటుంబాలకు అందజేస్తోన్న సిలిండర్లపైనా ఈ వడ్డింపు వర్తించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page