![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జులై 03
గుండాల మండలం, శంభునిగూడెం గ్రామ పంచాయితీలో ప్రజల సమస్యల గురించి గ్రామస్థుల సమక్షంలో గుండాల మండల అధికారులు, అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిపి గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని ఆయా శాఖల అధికారులకు సంబందించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.


