Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

Loading

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

వేడుకల్లో పాల్గొన్న మండల ముఖ్య నాయకులు

చర్ల,మన భద్రాద్రి న్యూస్, జూలై 24 :

చర్ల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాజీ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల కార్యదర్శి పోలిన లంక రాజు మాట్లాడుతూ 10 సంవత్సరాలు ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం హయాములో అలుపెరుగని సైనికుడిలా పనిచేసిన వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని.నేటికీ పెన్షన్లు అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అవస్థలు పడుతున్నారని అన్నారు.

అనంతరం ఒకరికొకరు కేకు తినిపించుకొని కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చింత నాగేంద్రబాబు,ఎస్డి అజిజ్,దొడ్డి తాతారావు, కాకి అనిల్, గొమ్ముగూడెం మాజీ సర్పంచ్ పోడియం మురళి, కేశవాపురం మాజీ ఉపసర్పంచ్ గొలుసుల మురళి, ఇర్స్ వడ్ల రాము, తోట మల్ల రవికుమార్, కొంబత్తిన రాము, నిరంజన్, ఆలం బ్రహ్మ నాయుడు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page