![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, మే 17
చంద్రుగొండ మండలంలోని అయ్యన్నపాలెం త్రిమూర్తుల ఆలయంలో
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331 వ ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు కృష్ణమాచారి, రామలింగేశ్వరచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సోము కృష్ణమాచారి, వారాధి రామాచారి, వెంకటాచారి, రవీందర్ రెడ్డి, నున్న వెంకటేశ్వర్లు, కిరణ్ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


