![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 15
గిరిజనుల(లంబాడీ) ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని మండల కేంద్రంలో గుండాల తండా బంజారాలు శనివారం ఘనంగా నిర్వహించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తండా వాసులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో గుండాల తండా, పోలీస్ స్టేష,న్ కొత్త గుంపు మీదుగా గుండాల మెయిన్ రోడ్డుకు చేరుకొని ప్రధాన కూడలిలో బంజారా ఆట, పాటలతో తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ను వారి ఆరాధ్య దైవంగా పూజిస్తామని వారు తెలిపారు. సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు ఉంటే పంటలు బాగా పండుతాయని, ఆయురారోగ్యాలతో జీవిస్తామని వారి విశ్వాసం. బంజారా ఆరాధ్య దైవమైన శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వించదగ్గ విషయమని వారు ఈ సందర్భంగా అన్నారు. ఈ వేడుకలో తండా గ్రామ పెద్దలు ధారావత్ వాగ్య, దారావత్ మోహన్, వాంకుడోత్ రమేష్, జాటోత్ హీరు, జాటోత్ రవి, జాటోత్ వీరన్న, బానోత్ కిషోర్, నూనావత్ శంకర్, నూనావత్ రవి, బానోత్ నవీన్, గుగులోత్ వీరన్న, జాటోత్ అనిల్, మంగీలాల్, నూనావత్ పవన్, బానోత్ లాలు, జాటోత్ దేవా, బానోత్ మంగీలాల్, నూనావత్ అర్జున్, భూక్యా
గోపాల్, జాటోత్ తవురియా, జాటోత్ జోగు, భాను, ఆర్ఎంపీ బాలు, తదితరులు పాల్గొన్నారు.


