Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemచందా లింగయ్య గెలుపే మా లక్ష్యం

చందా లింగయ్య గెలుపే మా లక్ష్యం

Loading

-ఆదివాసీ జేఏసీ

గుండాల/ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 11

మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో ఆదివాసీ జేఏసీ తొమ్మిది సంఘాల మద్దతుతో చందా లింగయ్య దొరను అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంటు తుడుందెబ్బ అభ్యర్థి చందా లింగయ్య గెలుపు కోసం ఆదివాసీ జేఏసీ నాయకులు శనివారం పల్లె పల్లెనా ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఉమ్మడి గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలలో అడవిరామారం, మర్కోడు, ఆళ్లపల్లి, పెద్ద వెంకటాపురం, సంధిబంధం పలు గ్రామాలలో ఆదివాసీ నాయకులు ఎండను సైతం లెక్కచేయకుండా చందా లింగయ్య గెలుపుకై గడపగడపకు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు, కోడెం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శిలు పూనెం శ్రీనివాస్, వజ్జ ఎర్రయ్య, మోకాళ్ళ కన్నయ్య, ఈసం సాంబయ్య, మండల ప్రధాన కార్యదర్శి చింత వెంకటేశ్వర్లు, కల్తి సత్యం, మోకాళ్ళ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page