![]()
చందు నాయక్ మద్దతు పలికిన సారపాక ఆటో యూనియన్
సారపాక గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో నిలిచిన దరావత్ చందు నాయక్‌కు సారపాక ఆటో యూనియన్ వెల్లడించిన మద్దతుతో ఎన్నికల వేడి మరింత పెరిగింది. గ్రామాభివృద్ధి పట్ల చందు నాయక్ చూపుతున్న కృషి, ప్రజలతో కలిసిమెలిసి పనిచేసే విధానం పరిపూర్ణ నాయకత్వానికి నిదర్శనమని యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు.
ఆటో డ్రైవర్ల సమస్యలు, రోడ్ల మరమ్మత్తులు, స్టాండ్ సౌకర్యాలు వంటి అంశాలను చందు నాయక్ ముందుండి పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గ్రామ అభివృద్ధికి అతడి సేవలు కొనసాగాలన్న సంకల్పంతో యూనియన్ ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది.
చందు నాయక్ ఈ మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సారపాకను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.


