![]()
తిరుమల, మన భద్రాద్రి వెబ్ డెస్క్: తిరుమలలో మరోసారి చిరుత పులి అలజడి రేగింది. అలిపిరి-ఎస్వీ పార్క్ జూ రోడ్డులో వెళ్తున్న బైకర్లపై చిరుత దాడికి యత్నించింది. అయితే బైకర్లు తృటిలో తప్పించుకోగా.. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
తిరుమలలో శుక్రవారం సాయంత్రం బైకర్ల మీద ఓ చిరుత దాడికి యత్నించింది. రోడ్డు పక్కన కల్వర్టు మాటున దాక్కుని.. బైక్ రాగానే వాళ్ల మీదకు దూకింది. అయితే వాళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే చిరుత పొదల్లోకి వెళ్లింది. వెనక కారులో వస్తున్నవాళ్లు ఆ ఘటనను వీడియో తీశారు. అందకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది. అయితే ఈ వీడియోపై అధికారులు స్పందించాల్సి ఉంది.


