Wednesday, March 25, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemచెరువుకు పడ్డ గండిని పూడ్చండంటూ వేడుకుంటున్న రైతులు

చెరువుకు పడ్డ గండిని పూడ్చండంటూ వేడుకుంటున్న రైతులు

Loading

కరకగూడెం, మన భద్రాద్రి న్యూస్

కరకగూడెం మండలం రాయణపేట పరిధిలోని చిర్రకుంట చెరువుకు భారీ గండి పడింది. కరకగూడెంలో రాత్రి కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు నిండి అలుగు పడి పారుతున్నాయి. దీంతో మరమ్మత్తులకు నోచుకోని ఎన్నో చెరువులకు గండ్లు పడి నీరు యథేచ్చగా పెద్దవాగు నుండి గోదావరిలో కలుస్తున్నాయి. చెరువు నీరు వృథాగా పోతున్న తీరును చూసి ఆయకట్టు రైతులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి చెరువుకు పడ్డ భారీ గండిని పూడ్చాలని ఆయకట్టు రైతులు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page