![]()
చేపల వేటకు వెళ్లి చెక్ డ్యాంలో వ్యక్తి గల్లంతు
పినపాక, మన భద్రాద్రి న్యూస్
చేపల వేటకు వెళ్లి ఒక వ్యక్తి గల్లంతయిన సంఘటన పినపాక మండలంలోని పొట్లపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని పోట్లపల్లి గ్రామానికి చెందిన బడే నాగరాజు, పాయం నగేష్ ఇద్దరూ కలిసి చేపలు పట్టేందుకు పొట్లపల్లి వాగు చెక్ డ్యామ్ వద్దకు వెళ్లారు. చెక్ డ్యాంలోకి దిగి చాపలు పడుతుండగా, ఒక్కసారిగా వరద ప్రవాహం అధికమవ్వడంతో నగేష్ వరదలో కొట్టుకొని పోయాడు. బడే నాగరాజు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


