Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemజన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి

జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి

Loading

-సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ విజ్ఞప్తి

కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో, మార్చి 04

మున్సిపాలిటీ పరిధిలోని ఓల్డ్ డిపో ఏరియా, రైల్వే స్టేషన్ సెంటర్, బస్టాండ్ సెంటర్, పోస్ట్ ఆఫీస్ ఏరియా, ఎస్పీ కార్యాలయం సెంటర్, రామవరం, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలతోపాటు పలు ప్రధాన సెంటర్లలో తక్షణమే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ మంగళవారం ఒక ప్రకటనలో అధికారులకు విజ్ఞప్తి చేశారు. వేసవికాలం ప్రారంభం కావడంతో రాష్ట్రంలోనే ప్రథమంగా కొత్తగూడెంలో విపరీతమైన ఎండలు ఉండే విషయం అందరికీ తెలిసినదే. ఇప్పటికే ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయిందని, సుదూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వచ్చే వారి కోసం ఉచితంగా నీటి సౌకర్యం అందించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధికారులకు ఉందని ఆయన అన్నారు. తక్షణమే జనం రద్దీగా ఉండే అన్ని ప్రాంతాలలో చలివేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ప్రకటనలో కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page