![]()
– వట్టం ఉపేందర్
గుండాల, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 07ఆదివాసీ ఉద్యమ రథసారథి, కీర్తిశేషులు జవ్వాజీ లక్ష్మీనారాయణ ఏడవ వర్ధంతి సభను మండల కేంద్రంలో శనివారం తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు తుడుందెబ్బ ఉపాధ్యక్షులు వజ్జా ఎర్రయ్య అధ్యక్షత వహించగా తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ.. కీర్తిశేషులు జవ్వాజీ లక్ష్మీనారాయణ పీడిత ప్రజల పక్షపాతి అని, నిరంతర ఉద్యమనేత అని, పేద ప్రజల హక్కుల కోసం బందుకూ పట్టి పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్డ్, ఆరవ షెడ్యూల్డ్ లోని ఆదివాసీ హక్కుల కోసం తుడుందెబ్బ స్థాపించిన వ్యక్తులలో లక్ష్మీనారాయణ ఒకరని, ఆదివాసీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి అని, ఆదివాసీ ప్రజల రక్షణ చట్టాలైన భూబదలాయింపు, నిషేధిత చట్టం 1/70 యాక్ట్, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2026 మొదలగు చట్టాల అమలు కోసం ఆయన నిరంతరం ఉద్యమం చేశారని గుర్తు చేశారు. ఆదివాసీ విద్యార్థి ఉద్యమానికి పునాది వేసి, విద్యార్థులను ఉద్యమంలో భాగస్వామ్యం కలిగించిన ఘనత ఆయనకు ఉందన్నారు. అనంతరం ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.. జవ్వాజీ లక్ష్మీనారాయణ నిరంతర ఉద్యమ కార్యచరణ కలిగిన వ్యక్తి అని, భారీ ప్రాజెక్టుల ద్వారా ఆదివాసీలు నిర్వాసితులు కాకుండా, భారీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాటం, గ్రీన్ హంట్ వ్యతిరేక పోరాటం, పోడు భూముల హక్కుపత్రాల పోరాటం మొదలగు పోరాటాలను ఆయన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాకుల శ్రావణ్ కుమార్, కొడెం వెంకటేశ్వర్లు, తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వట్టం కన్నయ్య, గుంపిటి వెంకటేశ్వర్లు, పూనెం శ్రీను, సిపిఐ(ఎంఎల్) పార్టీ ఆవునూరి మధు, మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, దుగ్గారపు వీరభద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి చింత వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి మోకాళ్ళ కన్నయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సుర్ణబాక కిషనరావు, మహాబాద్ జిల్లా కార్యదర్శి చీమల శివ కుమార్, నాయకులు పొంబోయిన ముత్తయ్య, కోరం సీతారాములు, పూనెం మంగయ్య, తెల్లం రాజు, రమేష్, మోకాళ్ళ వీరస్వామి, తోలం గోపి, కొమరం లక్ష్మికాంత, వాసం రామకృష్ణ, పెండకట్ల యాకయ్య, తుడుందెబ్బ మండల అధ్యక్షులు గోవింద నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి మోకాళ్ళ మహేందర్, జవ్వాజీ జోషి మరియు కుటుంబ సభ్యులు, మైనారిటీ నాయకులు ఎండీ పాషా, ఎస్కే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.


