![]()
జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ముగ్గుల పోటీలు
టేకులపల్లి, మన భద్రాద్రి
టేకులపల్లి మండలం, ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. జాతీయ బాలికల దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని పాఠశాలలో స్థానిక మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో పాల్గొన్న మహిళలు, యువతులు రకరకాల రంగులతో అర్థవంతమైన, ఆకర్షణీయమైన ముగ్గులను వేసి అందరినీ అలరించారు. ఈ పోటీలలో మొదటి బహుమతి కె విజయ, ద్వితీయ బహుమతి ఎల్ మౌనిక, తృతీయ బహుమతి ఎల్ గాయత్రి, శిరీష, కావ్య, సోను లు గెలుచుకున్నారు. వీరందరికీ గణతంత్ర దినోత్సవం నాడు బహుమతులు అందజేయనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మోతుకూరి పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాలోత్ సురేందర్ నాయక్, ఉపసర్పంచ్ చేతుల భద్రయ్య, కార్యదర్శి పి శ్వేత, అంగన్వాడి టీచర్ వై పద్మావతి, స్థానిక మహిళలు, యువతులు తదితరులు పాల్గొన్నారు.


