![]()
ములుగు, మన భద్రాద్రి న్యూస్, జూలై 12
ములుగు జిల్లా వ్యాప్తంగా రేపు శనివారం పలు మండలాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని శుక్రవారం ములుగు జిల్లా (ఎన్పీడీసీఎల్) డివిజనల్ ఇంజనీర్ పులుసం నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 132/33 కేవీ ఉపకేంద్రం, ఇతర 33/11 కేవీ ఉప కేంద్రాలలో అత్యవసర మరమ్మత్తుల పనులకై, రేపు శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ములుగు జిల్లా పరిధిలోని ములుగు, పత్తిపల్లి, కాసిందేవపేట, మల్లంపల్లి, అబ్బాపూర్, రామచంద్రాపూర్, పందికుంట, వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట, నర్సాపూర్, వెల్తుర్లపల్లి, గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, రాజుపేట, ఏకే మల్లారం, వాజేడు, వెంకటాపురం ఉప కేంద్రాల పరిధిలోని అన్ని గ్రామాలకు తాత్కాలిక మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.


