Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemజీవో నెంబర్ 22 ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి

జీవో నెంబర్ 22 ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి

Loading

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 15

మండల కేంద్రంలో బుధవారం సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి రోడ్ క్లీనింగ్ వర్కర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు గూగులోత్ రామ్ చందర్ పాల్గొని మాట్లాడుతూ కనీస వేతనాలు తక్షణమే జీవో నెంబర్ 22 ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని, సింగరేణి రోడ్ క్లీనింగ్ వర్కర్స్ యూనియన్ కాంట్రాక్ట్ కార్మికులకు మార్కెట్ లో ఉన్న నిత్యవసర వస్తువుల ధరలను పరిగణంలోకి తీసుకొని, గత 16 సంవత్సరాల నుంచి వేతనాలను పెంచకపోవడం వలన జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా కనీస వేతనాలను నిర్ణయించాలని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్ లో పొందుపరిచిన వేతనాల ప్రతిపాదన సక్రమంగా లేదని, తక్షణమే దానిని ఉపసరించుకొని 2021 జూన్ నెలలో విడుదల చేసిన జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుగులోతు రామారావు, ఉపాధ్యక్షుడిగా భూక్యా ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా వాసం భద్రయ్య, సహాయ కార్యదర్శిగా అజ్మీరా రాంబాబు, కోశాధికారిగా గుగులోతు బుజ్జిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల వైస్ ప్రెసిడెంట్ అయిత శ్రీరాములు, ఈసం నరేష్, లకావత్ శివ, వాసం నరేందర్, బానోత్ బాలు, ఈసం ప్రభాకర్, రాంబాబు, ఉప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page