![]()
జీ.వో. నెం. 3 పునరుద్ధరణ చేయాలి.
ఉపాధ్యాయులకు 45% ఫిట్ మెంట్ ప్రకటిస్తూ నూతన పి ఆర్ సి అమలు చేయాలి.
==============
టేకులపల్లి మన భద్రాద్రి న్యూస్
టీ.ఎస్.ఏ.టీ.మోకాళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ హైదరాబాద్ కార్యాలయం నందు ధర్నా జరిగింది. ధర్నాకు సంబంధించి మోకాళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ఆదివాసి డి ఎస్ సి -2024 ద్వారా నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేయలని ఆదివాసి గిరిజన ఎమ్మెల్యేలతో (ట్రైబల్ అడ్వైసరీ కమిటీ (టీ ఏ సి ) ఏర్పాటు చేసి టీఏసి తీర్మానం చేసి శాసనసభ ఆమోదం ద్వారా జీ. ఓ నెం.3పునరుద్దరణ చేసి చట్ట బద్దత కల్పించి ప్రాంతాలలోని ఉపాధ్యాయులు ఆదివాసులకు మాత్రమే ఉద్యోగలు భర్తీ చేయాలని .ఏజెన్సీ పాఠశాలలో ఉపాధ్యాయ నియమకాలు, పదోన్నతులకు సంబంధించిన జీఓ. నెం.3కి కల్పించేలా ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని తమరి ద్వారా విన్నపించుకుంటున్నాం. జి. ఓ. నెం.3, తేదీ 10-1-2000తో పాటు ఏజన్సీ ఉద్యోగాలనియామకాలు, పదోన్నతుల కోసం ఏర్పాటుచేసిన 29 శాఖల సంబంధించిన ఇతర జీవోలను చట్టసభలలో ఆమోదించి చట్టబద్ధత కల్పించలని .ఉపాధ్యాయులకు బదిలీలు,పదోన్నతులు, నియమకాలు ఏజెన్సీ ప్రాంతం, మైదాన ప్రాంతాల వారికి వేరువేరుగా చేపట్టాలి. పి. ఆర్.సి -2020 సిఫారుసు ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో విధులునిర్వహిస్తున్నఉద్యోగఉపాధ్యాయులకు ఏజెన్సీ అలవెన్స్ మంజూరు చేస్తున్నట్టు జిఓ విడుదల చేయాలి. ప్రాథమిక పాఠశాల ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుని నియమించని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 45% ఫిట్మెంట్ ప్రకటిస్తూ నూతన పి. ఆర్. సి అమలు చేయాలని అధికారులు చొరవ తీసుకొని స్థానికంగా పోస్టులు కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బకుల రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పీర్ల కృష్ణ బాబు, ప్రచార కార్యదర్శి కురసం అంజయ్య, కోశాధికారి కుంజ కృష్ణ, కార్యదర్శి ఉడతులురి లింగయ్య, తదితరులు నాయకులు పాల్గొన్నారు.


