![]()
-టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పిలుపు
ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్, జులై 03
మండల పరిధిలోని ఆశ్రమ హైస్కూల్ మర్కోడులో బుధవారం టీపీటీఎఫ్ మండల ఉపాధ్యక్షులు వై నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగ రాంబాబు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటి పిలుపులో భాగంగా జులై 6 న గిరిజన సంక్షేమ కమిషనర్ హైదరాబాద్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు పన్నెండు సంవత్సరాలుగా పదోన్నతులు, ఆరు సంవత్సరాలుగా బదిలీలు, పన్నెండు సంవత్సరాలుగా ప్రత్యక్ష నియామకాలు లేవని, 2013-14 సంవత్సరములు కన్వర్ట్ చేయబడిన ఆశ్రమ పాఠశాలలకు నేటికి పోస్టులు మంజూరు చేయలేదని, పది హేను సంవత్సరములుగా సీ ఆర్ టీ లు శ్రమ దోపిడికి గురవుతున్నారని, వీరిని రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ తరువాత ప్రభుత్వ గిరిజన సంక్షేమ రెండవ పెద్ద సెక్టర్ గా ఉన్నదని, సంక్షేమ రంగంగా పాలకులు చెప్పుకుంటున్న గిరిజన సంక్షేమ శాఖ పట్ల సవతి ప్రేమను ప్రదర్శించడం సరి కాదని అన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆందోళనా ఉద్యమాలు చేయవలసిన సమయం ఆసన్నమైనదని అన్నారు. మండలం నుండి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై, గిరిజన సంక్షేమ కమిషనర్ హైదరాబాద్ కార్యాలయం ముందు జరుగే నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమరం రాంబాబు, జి జోగయ్య, కల్తీ వసంత రావు, వేల్పు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


