![]()
- ఎన్నికల ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం
- క్లస్టర్ ఇన్‌చార్జులతో సమాలోచనలు
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (KCR) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్‌చార్జులు, పార్టీ సీనియర్ నాయకులతో ఎర్రవెల్లి నివాసంలో గురువారం ఆయన ఈ కీలక సమావేశం నిర్వహించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన పూర్తయిన నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. ఇకపై ప్రచార వ్యూహాలే గెలుపులో కీలకం కానున్నాయి.
ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు హాజరయ్యే ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహ్యాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్లు అనుసరించాలని విధానాలపై సూచనలు, సలహాలు కేసీఆర్ ఇవ్వనున్నారు.


