Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemజేకే ఓసీ కార్మికుల బదిలీలను ఆపాలి - టీబీ జెకేఎస్ డిమాండ్

జేకే ఓసీ కార్మికుల బదిలీలను ఆపాలి – టీబీ జెకేఎస్ డిమాండ్

Loading

జెకె ఓసి కార్మికుల బదిలీలను ఆపాలి – టీబీ జెకేఎస్ డిమాండ్.

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, మే 20

ఒకవైపు ఇల్లందు ను కాపాడుకుందాం కార్మికుల బదిలీలను ఆపుతామని చెప్పిన గెలిచిన సంఘాలు ఈ రోజు కార్మికులు బదిలీ అవుతుంటే చూస్తూ చోద్యం చూస్తున్నారు. పూసపల్లి ఓ సి  ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తరువాత కొత్త ఓసి లో తమకు భవిష్యత్ ఉంటుందని, ఇక ట్రాన్సఫర్ లు లేకుండా ఉంటామని కార్మికులు  భావించారు. గెలిచిన సంఘాలు నాయకులు కూడా ఒక్క కార్మికుడిని ఇక్కడినుండి ట్రాన్స్ఫర్ కానివ్వమని చెప్పటంతో భరోసాగా ఉన్నారు. కానీ యాజమాన్యం మాత్రం డిప్యూటెషన్ అంటూ వంద కిలోమీటర్ల దూరం పంపటం, పాఠశాలలు ప్రారంభం కానున్న తరుణంలో ఇలా చేయటం ఎంతవరకు న్యాయమని కార్మికులు వాపోతున్నారు. కొంతమంది సీనియర్ కార్మికులు మాకు ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని అడుగుతున్నా వారిని పక్కన పెట్టీ డిప్యూటెషన్ ఇవ్వడమేమిటి అని కార్మికులు అడుగుతున్నారు. అలాగే సీనియారిటీని కాదని ప్రొటెక్టెడ్ వర్క్ మెన్ అని కొంతమంది జూనియర్ కార్మికులను అప్పటికప్పుడు జీఎం స్ట్రక్చర్ కమిటీలో పేర్లు పెట్టించి వారిని ఆపే ప్రయత్నం కార్మిక ద్రోహమేనని, ఇది కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసినట్లే నాని కార్మికులు పేర్కొంటున్నారు. ఒక వైపు సింగరేణి చైర్మెన్ పారదర్శకంగా ట్రాన్స్ఫర్ చేయాలని చెపుతుంటే కొందరి ట్రాన్స్ఫర్లు ఆపడానికి అడ్డదారుల్లో కార్మికసంఘాలు ప్రయత్నం చేయటం హేయమైన చర్య అని, దీనిని టీబీజీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని టీవీ జెకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ
ఎస్.రంగనాథ్, వైస్ ప్రెసిడెంట్ ఎండీ.జాఫర్ అధికారులను డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page