Tuesday, March 24, 2026
HomeTelangana Newsటీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలో బీజేపీ ఘన విజయం

టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలో బీజేపీ ఘన విజయం

Loading

టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలో బీజేపీ ఘన విజయం

  • బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్ వి. హతిరామ్ నాయక్

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్

బీజేపీ టేకులపల్లి మండల కమిటీ అధ్యక్షులు తేజవత్ శంభూ ఆద్వర్యంలో కరీంనగర్ నిజాంబాద్ మెదక్ ఆదిలాబాద్ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో మల్కా కొమరయ్య చిన్నపాయల అంజి రెడ్డి ఘనవిజయం సాధించిన సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంచగొట్టు సంబరాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పాలనను చూసి ప్రజలు ఏ ఎన్నికలు వచ్చిన బీజేపీ పార్టీ ఓటు వేసి గెలిపిస్తున్నారని, భారత దేశాన్ని ప్రపంచంలో విశ్వ గురువుగా నిలపడమే మోడీ లక్ష్యం అని తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ ఎంపీ లు, ఎమ్మెల్యేల కృషి వలన ఘన విజయం సాధించారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ద్రావ సింగ్, బాలాజీ నాయక్, ప్రథాన కార్యదర్శి సురేష్, అప్పారావు, నరేష్, జామాల్, సురా పార్వతీ, సీతా, సుహాసిని, కుమారి, ఉమా, విజయ, సునీత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page