Monday, March 23, 2026
HomeAndhra Pradeshటీడీపీకి రాజీనామా చేసిన అశోక్‌గజపతిరాజు

టీడీపీకి రాజీనామా చేసిన అశోక్‌గజపతిరాజు

Loading

ఏపీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీకి పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు.

ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌లకు పంపించారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించ వలసిందిగా కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కోరారు. తెలుగుదేశం పార్టీలో తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినందుకు పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 14న ఆయనను ఈ పదవికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

కాగా, విశాఖపట్నం రాజవంశానికి చెందిన ఆయన దివంగత సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక విజయనగరం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఒకసారి ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే, 2014లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అశోక్‌ గజపతి రాజు ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాణ శాఖ మంత్రిగా చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page