![]()
-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
ఏటూరునాగారం, మన భద్రాద్రి న్యూస్, మే 18
పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచన మేరకు ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను అధిక మెజార్టీతో గెలిపించాలని ఏటూరునాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు శనివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో సామాన్య ప్రజలను, విద్యార్థులను అన్ని విధాల ఆదుకున్న ప్రజా సేవకుడు తీన్మార్ మల్లన్న అని కొనియాడారు. తనకున్న యావదాస్తిని సైతం ప్రభుత్వానికి ఇచ్చిన ఏకైక నాయకుడు మల్లన్న మాత్రమేనని అన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో నేరుగా మాట్లాడిన వ్యక్తి అని, చదువుకున్న యువత, విద్యావేత్తలు అలోచించి ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకయినటువంటి తీన్మార్ మల్లన్నని గెలిపించాలని ఆయన కోరారు.


