![]()
-ఎంపీటీసీ వేముల భారతి పిలుపు
అశ్వారావుపేట, మన భద్రాద్రి న్యూస్, మే 17
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని శుక్రవారం ఎంపీటీసీ వేముల భారతీ ప్రతాప్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక, నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి మల్లన్న అని, తన ఛానల్ ద్వారా అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి, తప్పు చేసేవారు తన వారైనా, ప్రత్యక్ష ఆధారాలతో నిలదీసి ప్రశ్నించే జర్నలిస్ట్ మన తీన్మార్ మల్లన్న ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని, తమ తోటి పట్టభద్రులను తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని కోరారు. మే 27 న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం – నల్గొండ – వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన నియమించబడడం చాలా సంతోషకరమని, ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులు ప్రజా గొంతుక అయినటువంటి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మనవి చేశారు. పట్టభద్రులారా ప్రజాస్వామ్యం బ్రతకాలంటే, రాజ్యాంగం అమలులో ఉండాలంటే ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు.


