![]()
అశ్వారావుపేట, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 24
మండల కేంద్రంలోని పేపర్ బోర్డులో అకస్మాత్తుగా దట్టమైన పొగతో మంటలు శనివారం ఎగిసిపడ్డాయి.మంటలు అదుపులోకి తేవడానికి అక్కడున్న సిబ్బంది ఎంతో ప్రయత్నించినా అదుపులోకి రాలేకపోవడంతో, లోపల మొత్తం పేపరు ఉండటం వలన మంటలని అదుపులోకి తీసుకురావటం చాలా కష్టమైంది. లోపల ఉన్న పనిచేస్తున్న వారు హఠాత్తుగా భయానికి గురై బయటకి పరుగులు తీశారు.గతంలో కూడా రెండు మూడు సార్లు పేపర్ బోర్డులో మంటలు చెడరేగటం జరిగింది.కానీ అక్కడున్న సిబ్బంది ఏ మాత్రం కూడా వాటిపై చర్యలు తీసుకోవడం లేదు.అక్కడ పనిచేసే లేబర్ తెలుగు వాళ్ళను కాకుండా బయట రాష్ట్రాల నుండి తీస్కొని వచ్చి తక్కువ జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళతో పని చేయించుకుంటున్నారు.ఇలా ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా పేపర్ బోర్డు సిబ్బంది గుట్టు బయటకు రాకుండా మసులుకుంటున్నారు.దీనిపై అధికారులు దృష్టి సారించి ఇకనైనా మంటలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, మంటలు రాకుండా రక్షణ కల్పించాలని అక్కడ పనిచేసే కార్మికులు సిబ్బందిని, అధికారులను కోరుతున్నారు.


