![]()
తెలంగాణ, మన భద్రాద్రి స్టేట్ బ్యూరో, మే 17
తెలంగాణలో వాహన నెంబర్ ప్లేట్లలో TS స్థానంలో TGని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం గతంలోనే ఆమోదం తెలపగా, తాజాగా TGని అమలుపరిచేందుకు ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ ను జారీ చేసింది. ఇకపై రాష్టంలో నెంబర్ ప్లేట్లు TGతో జారీ కానున్నాయి. ఇది కేవలం కొత్త వాహనాలకు మాత్రమే వర్తించనుంది. పాత వాహనాలు TS రిజిస్ట్రేషన్ తోనే కొనసాగనున్నాయి. కేంద్రం జారీ చేసిన గెజిట్ నిర్ణయంతో TG రిజిస్ట్రేషన్ అధికారికంగా అమలుకానుంది.


