Monday, March 23, 2026
HomeNational Newsత్వరలో ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌

త్వరలో ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌

Loading

  • ప్రధాని మోధీ

ఢిల్లీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్

వేగంగా పురోగమిస్తోన్న మన దేశం ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయిని చేరుకునే రోజు ఎంతో దూరం లేదని ప్రధాని మోదీ తెలిపారు.

నూతన ఉద్యోగాల సృష్టికి, సత్వరాభివృద్ధి సాధనకు నవ్యావిష్కరణలు, ఆర్థిక రంగం, ప్రజల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాలపై పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఉపాధి అంశంపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌లో భాగంగా బుధవారం ఆయన ప్రసంగించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మూడు కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణను అందించిందని ప్రధాని పేర్కొన్నారు. వెయ్యి ఐటీఐలను ఉన్నతీకరించామని, ఐదు విశిష్ట నైపుణ్య కేంద్రాల (సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌)ను స్థాపించామని వివరించారు. గత నెలలో విడుదలైన ఐఎంఎఫ్‌ నివేదికను ఉటంకిస్తూ ”2015-2025 మధ్య కాలంలో భారత్‌ 66 శాతం వృద్దితో 3.8 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందిందని” చెప్పారు. భారీ ఆర్థిక వ్యవస్థలున్న దేశాలను అధిగమించామని, త్వరలోనే ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page