Monday, March 23, 2026
HomeAndhra Pradeshదారుణం..పదేళ్ల బాలికపై బాబాయ్ లైంగిక వేధింపులు

దారుణం..పదేళ్ల బాలికపై బాబాయ్ లైంగిక వేధింపులు

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: దేశంలో రోజు రోజుకీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చివరికి ఇంట్లో సైతం వారికి రక్షణ లేకుండా పోతుంది. వావి వరుసలు మరిచి, కన్నబిడ్డలా చూసుకోవాల్సిన బంధువులే కామాంధులుగా మారి దారుణాలను పాల్పడుతున్నారు.

తాజాగా కాకినాడ (Kakinada) జిల్లాలోని ఓ గ్రామంలో ఘోర ఘటన వెలుగుచూసింది. పదేళ్ల బాలికపై సొంత బాబాయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులెవరూ ఇంటిలో లేని సమయంలో అతడు బాలికను ఒంటరిగా చూసి అఘాయిత్యానికి యత్నించినట్టు పోలీసులు తెలిపారు. బాధిత బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు తెలియజేయగా, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పొక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. కుటుంబంలోనే బాలికలు సురక్షితంగా లేరనే వాస్తవాన్ని మరోసారి బయటపెట్టింది. చిన్నారులపై ఇలాంటి దాడులు చోటు చేసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page