![]()
దిశ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
కరకగూడెం, మన భద్రాద్రి న్యూస్,
కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దిశ రిపోర్టర్ బుడగం ప్రవీణ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మరియు సమత్ బట్టుపల్లి సర్పంచ్ నియోజకవర్గ నాయకురాలు పోలేబోయిన శ్రీవాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి జర్నలిజం ఎంతో అవసరమని, సమాజంలో జరిగే పరిస్థితులను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేయడంలో మీడియా ముందుంటుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో మీడియా ఎంతో కీలకమనీ, సమాజంలో జరిగే పరిస్థితులను సమస్యలను అధికారులకు, ప్రజలకు తెలియజేయడంలో మీడియాదే కీలకపాత్ర అన్నారు. అలాగే అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న మీడియా రంగాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఉపసర్పంచ్ రావుల రవి, మండల నాయకులు ఎర్ర సురేష్, జలగం కృష్ణ, గొగ్గల రవి, బుడుగుల మధు తదితరులు పాల్గొన్నారు.


