Monday, March 23, 2026
HomeNational Newsదేశంలో సంచలనం.. భారత ఉప రాష్ట్రపతి రాజీనామా

దేశంలో సంచలనం.. భారత ఉప రాష్ట్రపతి రాజీనామా

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: దేశ రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్ పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ సంచలన సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య సమస్యల కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ముకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, 2022 ఆగష్టు 11న ఆయన ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 1990-1991 వరకు కేంద్రమంత్రిగా, 2019 నుంచి 2022 వరకు బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. కిసాన్ పుత్రగా ఆయన దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. జనతాదళ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన గతంలో శాసనసభ, లోక్‌సభ సభ్యుడుగా కూడా పనిచేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page