Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemనకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయిస్తే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయిస్తే కఠిన చర్యలు

Loading

-మండల సీఐ ఎల్ రవీందర్

గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 21

గుండాల మండల పరిధిలోని ఫర్టిలైజర్ షాప్ డీలర్స్ తో మంగళవారం మండల సీఐ ఎల్ రవీందర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అరికట్టడం, విత్తనాలను లైసెన్స్ లేని కంపెనీల నుండి గానీ, ఆథరైజేషన్ లేని కంపెనీ విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వారి లైసెన్స్ రద్దు చేస్తామని, ఎక్స్పైరీ డేట్ లేనటువంటి విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు అమ్మినచో వారిపై చర్య తీసుకుని, లైసెన్స్ రద్దు చేసి, పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు, విక్రయించిన ప్రతీ దానికి రసీదు తప్పనిసరిగా రైతులకు ఇవ్వాలని ఆయన తెలిపారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ తో గుర్తింపు పొందిన బిల్ బుక్స్ మాత్రమే ఉపయోగించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులు కూడా లైసెన్స్ ఉన్న డీలర్ వద్దనే విత్తనాలు, క్రిమి సంహారక మందులు తీసుకోవాలని, గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోళ్లు చేసి మోసపోవద్దని, ఎక్కువ రాబడి వస్తుందని మోసం చేసే గుర్తు తెలియని వ్యక్తుల వద్ద విత్తనాలు కొనవద్దని రైతులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page