![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్
చండ్రుగొండ మండలం గానుగపాడు గ్రామంలో నీరు లేక నర్సరీ మొక్కలు ఎండిపోతున్న వైనం. ఎన్నో వేల రూపాయలు ఖర్చుపెట్టి మొక్కలను ప్రభుత్వం పెంచుతూ ఉంటే సరైన పరిరక్షణ లేక ఆదిలోనే చనిపోతున్నాయి. నీటి సౌకర్యాలు ఉన్నా కూడా వాటిని పెంచలేక నిర్లక్ష్యం వహిస్తున్నారు. నర్సరీ ల పై అధికారులు సరైన పర్యవేక్షణ లేనందున మొక్కలు ఎండిపోతున్నాయి. కొన్ని వేల రూపాయలు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మొక్కల పెంపకంపై పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చి ప్రజాధనాన్ని కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


