![]()
నూతనంగా సొసైటీ చైర్మన్ గా కొమ్మినేని
జూలూరుపాడు,మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 11
నూతనంగా సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కొమ్మినేని పాండురంగారావు కు జిల్లా కాంగ్రెస్ నాయకులు దుద్దుకూరి సుమంత్ ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా సుమంత్ మాట్లాడుతూ సహకార సంఘాన్ని ఒక మోడల్ సొసైటీ గా అభివృద్ధి చేయాలని కోరారు. అదేవిధంగా రైతులకు సొసైటీ ద్వారా వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేవిధంగా చూడాలని కోరారు.రైతులకు యూరియా కొరత లేకుండ చూడాలని, మరింత యూరియా అందేవిధంగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాళ్లూరి వెంకటేశ్వరావు, మాజీ సొసైటీ అధ్యక్షులు కొమ్మినేని కృష్ణమూర్తి, సిపిఐ సీనియర్ నాయకులు పొన్నేకంటి వెంకటేశ్వర్లు, సొసైటీ మెంబెర్ కళ్యాణపు నరేష్,మాజీ సర్పంచ్ బానోత్ నర్సింహారావు,తూము కోటయ్య,కాళ్లూరి ప్రవీణ్,కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు గాదె కృష్ణయ్య, జవ్వాది వీరయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంచర్ల హరీష్,వేల్పుల గోపాలకృష్ణ, మద్దిబోయిన నాగరాజు, యల్లంకి తిరుపతిరావు, యల్లంకి రవి, ఆనంగంటి ధనమయ్య,వేల్పుల శివరామకృష్ణ, దొప్ప సత్యం,పొనుగుపాటి వీరభద్రం, డంగు, బోడ హరిబాబు తదితరులు పాల్గొన్నారు


