Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemనూతన కార్యాలయం వద్ద బురద నివారణకు చర్యలు తీసుకోవాలి

నూతన కార్యాలయం వద్ద బురద నివారణకు చర్యలు తీసుకోవాలి

Loading

-ఎస్ అండ్ డీ విభాగం కార్మికుల విజ్ఞప్తి

మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జూలై 01

మణుగూరు ఏరియా పీకే ఓసి పరిధిలోని ఓసి-2 నూతన కార్యాలయం ప్రాంగణం భారీ వర్షాలకు అంతా బురద మయంలో అయిందని సోమవారం ఎస్ అండ్ డీ విభాగం కార్మికుల తెలిపారు. ఎస్ అండ్ డీ సెక్షన్ కార్మికులు మ్యాన్ వే వద్దకు వెళ్లి ఇన్ మస్టర్, అవుట్ మస్టర్ కొరకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నదని, జారుడు బల్లపై నుండి పిల్లలు జారినట్లుగా తమ వెతలు ఉన్నాయని కార్మికులు వాపోతున్నారు. అధికారులు, కార్మిక సంఘాల నాయకులు తమ సమస్యను పరిష్కరించాలని సామాజిక మాధ్యమాలు వేదికగా ఓసి 2 ఎస్ అండ్ డీ సెక్షన్ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page