![]()
ఆళ్లపల్లి: మండలంలో నేటి ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 33/11 కేవి ఆళ్లపల్లి సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల నిమిత్తం మండలంలోని సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలకు అంతరాయం కలుగుతుందని, కావున వినియోగదారులు గమనించి సహకరించగలరని విద్యుత్ శాఖ తెలిపింది.


