![]()
- సీతారామ ప్రాజెక్ట్ పాలేరు లింకు కాలువల సందర్శన
- పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనుల పై అధికారులతో సమీక్ష
ఖమ్మం, మన భద్రాద్రి బ్యూరో, జులై 02
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో నేడు పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు మహబూబాబాద్ జిల్లా తోడేళ్లగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పాలేరు లింకు కాలువను పరిశీలిస్తారని పేర్కొన్నారు. 10 గంటలకు ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గంలోని తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం చేరుకొని సీతారామ ప్రాజెక్ట్ పాలేరు లింక్ కెనాల్ ఆకేరు జలధారను సందర్శిస్తారని తెలిపారు. 11 గంటలకు దమ్మాయిగూడెంలో సొరంగ ప్రవేశ భాగాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. 11:30 గంటలకు బీరోలు కెనాల్ సొరంగ ఆడిట్ ను పరిశీలిస్తారని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు కూసుమంచి మండలం, పోచారం కెనాల్ సొరంగ నిష్క్రమణ భాగాన్ని, మధ్యాహ్నం 1:30 గంటలకు నర్సింహుల గూడెం గ్రావిటీ కెనాల్ ను పరిశీలిస్తారని దయాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూసుమంచి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, నియోజకవర్గంలోని మండల అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. కావున మంత్రి పర్యటనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.


