Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemన్యాయస్థానం ఆదేశాలను పాటించరా..?

న్యాయస్థానం ఆదేశాలను పాటించరా..?

Loading

న్యాయస్థానం ఆదేశాలను పాటించరా..?

కోయ కుల దృవీకరణ పత్రాలు జారీ చేయాలని

తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించిన ఆదివాసీలు

చర్ల, మన భద్రాద్రి న్యూస్, మే 19:

చర్ల తాసిల్దార్ కార్యాలయాన్ని వందల సంఖ్యలో గొత్తి కోయలు ముట్టడించారు.తమకు కోయ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ న్యాయస్థానం ఆదేశాలను పాటించడం లేదని గొత్తి కోయలు ఆందోళన చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గొత్తి కోయలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.అక్రమంగా జారీ అవుతున్న కుల ధ్రువ పత్రాల జారిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

డబ్బులు ఇస్తేనే కుల ద్రవపత్రాలు ఇస్తామంటే తాము డబ్బులు ఇస్తామంటూ బీస్మించారు.న్యాయంగా తమకు ఇవ్వాల్సిన కోయ ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి ఎస్ఐ కేశవ్ చేరుకొని గొత్తి కోయలతో చర్చించారు. బహుజన్ సమాజ్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొండ చరణ్, ,కొండ కౌశిక్ గొత్తి కోయల ఆందోళనకు మద్దతు పలికారు.తమకు వేరే గ్రామానికి ఇచ్చినట్టు పత్రాలు జారీ చేయాలని బైఠాయించి నినాదాలు చేశారు.

తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ…నిబంధనలను విరుద్ధంగా ఇచ్చిన కుల దృవపత్రాలను విచారణ చేసి రద్దు చేస్తామని,గొత్తి
కోయల కుల ధ్రువీకరణ పత్రాల జారిపై జిల్లా కలెక్టర్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గొత్తి కోయలు ఆందోళన విరమించారు. మురియా యువసేన నాయకులు మడకం చందు, పదం జోగయ్య,ఊడం ఉంగయ్య,మడకం రాజు, రాజయ్య,సోమయ్య, గంగయ్య,గంగోలి,భరత్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page