![]()
పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరనాకి నవీన్
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జనవరి 19
ఈ రోజు మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో ఈరోజు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటుకై మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల సురేష్ దరఖాస్తు చేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరనాకి నవీన్ మాట్లాడుతూ నియోజక వర్గంలోని పట్టభద్రులు ఫిబ్రవరి 6వ తేదీలోపు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ, పెండ్యాల రవి తదితరులు పాల్గొన్నారు.


